పాటలు అద్భుతంగా వచ్చాయి!
ABN , First Publish Date - 2021-07-27T05:50:03+05:30 IST
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్: రౌద్రం రణం రుధిరం’. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు...

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్: రౌద్రం రణం రుధిరం’. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను టి-సిరీస్, లహరి మ్యూజిక్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా టి-సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుడిగా రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం అంటే నాకెంతో ఇష్టం. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. పాటలు అద్భుతంగా వచ్చాయి’’ అన్నారు. లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు మాట్లాడుతూ ‘‘వ్యక్తిగతంగా కీరవాణి సంగీతం అంటే నాకెంతో ఇష్టం. సంగీత అభిమానిగానూ ఈ సినిమా పాటలు నాకెంతో నచ్చాయి. ప్రేక్షకులకూ నచ్చుతాయి’’ అన్నారు. త్వరలో పాటలు విడుదల కానున్నాయి.