రెండో ‘రాక్షసుడు’
ABN , First Publish Date - 2021-07-14T06:45:12+05:30 IST
రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న సినిమా ‘రాక్షసుడు-2’. హోల్డ్ యువర్ బ్రీత్... అనేది ఉపశీర్షక. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది...

రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న సినిమా ‘రాక్షసుడు-2’. హోల్డ్ యువర్ బ్రీత్... అనేది ఉపశీర్షక. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. సోమవారం కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. రమేశ్ వర్మ, కోనేరు సత్యనారాయణ కలయికలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్ ఇది. ‘రాక్షసుడు’లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా రమేశ్‌వర్మతో ‘ఖిలాడి’ నిర్మిస్తున్నారు కోనేరు సత్యనారాయణ. అది పూర్తయిన తర్వాత ‘రాక్షసుడు-2’ ప్రారంభం కానుంది. ‘‘సీక్వెల్లో ఓ స్టార్ హీరో నటిస్తారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తాం. ఇది మరింత ఉత్కంఠతో భయపెట్టేలా ఉంటుంది’’ అని దర్శక-నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కథ: రమేశ్‌వర్మ, మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, సంగీతం: జిబ్రాన్.