మా గౌరవాన్ని పెంచిన ‘పుష్ప’

ABN , First Publish Date - 2021-12-21T05:52:57+05:30 IST

‘‘మా సంస్థలో హిట్‌ చిత్రాలు చాలా వచ్చాయి. వాటిలో పుష్పకి ప్రత్యేక స్థానం ఉంటుంది. మా సంస్థ గౌరవాన్ని ప్రతిష్టని పెంచిన చిత్రమిద’’న్నారు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌. మైత్రీ మూవీస్‌ పతాకంపై...

మా గౌరవాన్ని పెంచిన ‘పుష్ప’

‘‘మా సంస్థలో హిట్‌ చిత్రాలు చాలా వచ్చాయి. వాటిలో పుష్పకి ప్రత్యేక స్థానం ఉంటుంది. మా సంస్థ గౌరవాన్ని ప్రతిష్టని పెంచిన చిత్రమిద’’న్నారు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌. మైత్రీ మూవీస్‌ పతాకంపై వీళ్లు నిర్మించిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేవలం మూడు రోజుల్లోనే రూ.173 కోట్ల గ్రాస్‌ సాధించి కొత్త రికార్డు సృష్టించాం. దాదాపు రూ.85 కోట్లు షేర్‌ రూపంలో వచ్చాయి. కేరళ, తమిళనాడులో మంచి వసూళ్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో అయితే దాదాపు రూ.14 కోట్లు రాబట్టింది. ఇంత స్పందన మేం ఊహించలేదు. ఓవర్సీస్‌లో త్వరలోనే రెండు మిలియన్ల మార్క్‌ చేరుకోబోతున్నాం. సాధారణంగా సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతాయి. కానీ.. ‘పుష్ప’ విషయానికొస్తే సోమవారం కూడా హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపించాయి. మంగళవారం తిరుపతిలో సక్సెస్‌ మీట్‌ నిర్వహిస్తున్నాం. ఈ విజయోత్సవంలో చిత్ర బృందం మొత్తం పాలు పంచుకోనుంద’’న్నారు. 


Updated Date - 2021-12-21T05:52:57+05:30 IST