సీటీమార్‌తో ఆ లోటు తీరింది

ABN , First Publish Date - 2021-09-16T06:33:57+05:30 IST

‘‘సీటీమార్‌’ పెద్ద హిట్‌ అవుతుందని సినిమా రిలీజ్‌ రోజే చెప్పాను. అదే నిజమైంది. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’’ అని గోపీచంద్‌ అన్నారు...

సీటీమార్‌తో ఆ లోటు తీరింది

‘‘సీటీమార్‌’ పెద్ద హిట్‌ అవుతుందని సినిమా రిలీజ్‌ రోజే చెప్పాను. అదే నిజమైంది. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’’ అని గోపీచంద్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘సీటీమార్‌’ సక్సెస్‌మీట్‌ ఇటీవలె జరిగింది. ఆయన మాట్లాడుతూ ‘‘ఫైట్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమన్నాతో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. ఈ మధ్య కాలంలో నా సినిమాలకు హిట్‌ అనే మాట వినలేదు. ఆ కొరతను ‘సీటీమార్‌’ తీర్చింది. వంద రూపాయల టిక్కెట్‌కు వెయ్యి రూపాయల ఆనందం ఇచ్చే సినిమా ఇది’’ అని అన్నారు. హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ ‘‘కరోనా వల్ల ‘సీటీమార్‌’ చిత్రీకరణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా సక్సెస్‌ ఆ ఇబ్బందులను మరిపించింది. వెన్ను నొప్పితోనే గోపీచంద్‌ జ్వాలారెడ్డి సాంగ్‌ షూట్‌లో పాల్గొన్నారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సంపత్‌నంది, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పాల్గొని ప్రేక్షకులకు ఽకృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-09-16T06:33:57+05:30 IST