‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ వరల్డ్ వైడ్ రైట్స్ ఎవరికంటే..?
ABN , First Publish Date - 2021-06-14T22:03:14+05:30 IST
'రాజావారు రాణిగారు' ఫేమ్ కిరణ్ అబ్బవరం, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా.. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రమోద్ - రాజు నిర్మాతలుగా, నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన సినిమా

'రాజావారు రాణిగారు' ఫేమ్ కిరణ్ అబ్బవరం, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా.. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రమోద్ - రాజు నిర్మాతలుగా, నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన సినిమా 'ఎస్‌ఆర్ కళ్యాణమండంపం ఈఎస్టీ 1975'. ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్‌ని శంకర్ పిక్చర్స్ వారు ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటన వచ్చినప్పటి నుంచి.. ప్రేక్షకులలో ఆసక్తి క్రియేట్ అయింది. ఆ తర్వాత విడుదల చేసిన చుక్కల చున్ని, చూసాలే కళ్లార వంటి పాటలు, టీజర్ కూడా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. రీసెంట్‌గానే ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్లుగా నిర్మాతలు ప్రమోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా శంకర్ పిక్చర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నట్లుగా నిర్మాతలు తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి పరిస్థితులు సాదారణ స్థితికి వచ్చి, థియేటర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు.