‘డబ్బు’ కోసం ఇంతగా దిగజారాలా!? పూజా హెగ్డేపై నెటిజన్ల ఫైర్..
ABN , First Publish Date - 2021-12-05T18:13:45+05:30 IST
‘డబ్బు’ కోసం ఇంతగా దిగజారాలా!? అంటూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవలికాలంలో సినీ సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా డబ్బు సంపాదనకు శ్రీకారం చుట్టారు.

‘డబ్బు’ కోసం ఇంతగా దిగజారాలా!? అంటూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవలికాలంలో సినీ సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా డబ్బు సంపాదనకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి వారిలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. అయితే, వీరు చేసే వాణిజ్య ప్రచారాల్లో ఏమాత్రం నైతిక విలువలు పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా తమకు డబ్బే ప్రధానమని, తాము ప్రచారం చేసే వస్తువులు లేదా బ్రాండ్ల గురించి ఆలోచించాల్సిన పని లేదనే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా పూజా హెగ్డే ఒక విస్కీ బ్రాండ్‌కు ప్రచారం చేయడం. ఇందుకోసం పూజా హెగ్డే మోకాళ్ళు పైభాగం వరకు ఒక గౌను ధరించి, ప్రముఖ కంపెనీ తయారు చేసిన ఈ విస్కీని ఒక గ్లాసులో పోసి, అందులో ఐస్ క్యూబ్స్, సోడా పోసి కలుపుతుంది.
ఆ తర్వాత తానేదో గొప్ప పనిచేసినట్టు ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది. దీన్నంతా ఒక వీడియో తీసి దానిని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా, అది వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసం మద్యం సేవించాలని ప్రోత్సహిస్తారా? అని కొందరు కామెంట్స్ చేస్తే, వీరికి ధనార్జనే ధ్యేయమని నైతిక విలువులు ఏమాత్రం పట్టించుకోరని మరికొందరు కామెంట్స్ చేశారు. కాగా, గతంలో కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇదే తరహాలో మద్యానికి ప్రచారం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ హీరోయిన్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అందుకే ఇపుడు పూజా హెగ్డే విస్కీ బ్రాండ్‌కు ప్రచారం చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, పూజా హెగ్డే తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ప్రభాస్ సరసన నటించిన ‘రాధే శ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
