'శుభలేఖ’ సుధాకర్‌కు మాతృవియోగం
ABN , First Publish Date - 2021-09-08T15:17:16+05:30 IST
ప్రముఖ సినీ నటుడు 'శుభలేఖ' సుధాకర్ తల్లి ఎస్ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ ఇంట్లోనే ఉంటూ రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణారావు మరణించారు.

ప్రముఖ సినీ నటుడు 'శుభలేఖ' సుధాకర్ తల్లి ఎస్ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ ఇంట్లోనే ఉంటూ రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణారావు మరణించారు. ఇక తల్లి కాంతంకు మూడు నెలల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు. సుధాకర్ పెద్దవారు. రెండో కొడుకు మురళీ వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో ఉంటున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఎస్ఎస్ కాంతం అంత్యక్రియలు జరుగనున్నాయి.