శివన్న పాత్ర టర్నింగ్‌ పాయింట్‌

ABN , First Publish Date - 2021-12-13T06:40:36+05:30 IST

‘రామ్‌ అసుర్‌’ చిత్రం నటుడిగా నా సినీ కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. ఈ చిత్రం తర్వాత ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకులు ‘శివన్నా’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు’’ అన్నారు నటుడు షానీ సాల్‌మాన్‌...

శివన్న పాత్ర టర్నింగ్‌ పాయింట్‌

‘రామ్‌ అసుర్‌’ చిత్రం నటుడిగా నా సినీ కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. ఈ చిత్రం తర్వాత ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకులు  ‘శివన్నా’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు’’ అన్నారు నటుడు షానీ సాల్‌మాన్‌(షానీ). ఆయన మాట్లాడుతూ ‘‘మా సొంతూరు జడ్చర్ల. 2003లో రాజమౌళి గారు ‘సై’ సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ‘ఘర్షణ’,  ‘రెడీ’, ‘ఒక్కమగాడు’ చిత్రాలు ఇండస్ట్రీలో నాకు బ్లాక్‌స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఇప్పటిదాకా 70 సినిమాల్లో నటించాను. ‘కిన్నెరసాని’, ‘అమరన్‌’, ‘గ్రే’, ‘పంచతంత్ర కథలు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నా వంతుగా పేద కళాకారులను అందుకునేందుకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని’’ చెప్పారు. 


Updated Date - 2021-12-13T06:40:36+05:30 IST