రొమాంటిక్ పెళ్లిసంద-డి
ABN , First Publish Date - 2021-09-15T06:35:15+05:30 IST
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన చిత్రం ‘పెళ్లిసంద-డి’. శ్రీ లీల కథానాయిక. త్వరలో ప్రేక్షకుల ముందుకి...

సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన చిత్రం ‘పెళ్లిసంద-డి’. శ్రీ లీల కథానాయిక. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ చిత్రం టీజర్‌ను అక్కినేని నాగార్జున మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. టీజర్‌లో రొమాంటిక్ సన్నివేశాల్లో హీరో, హీరోయిన్లు ఆకట్టుకున్నారు. ‘సహస్రకు పెళ్లి నాతోనా ఆ తొట్టి గ్యాంగ్ లీడర్‌తోనా?’ అని హీరో ప్రకాష్ రాజ్‌ని నిలదీసే సన్నివేశంతో పాటు సినిమాలో రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ ఘట్టాలను టీజర్‌లో ఆవిష్కరించారు. ‘‘సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాం. రాఘవేంద్రరావు గారి ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని గౌరీ రోణంకి తెలిపారు. మాధవి కోవెలమూడి, శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు.