రిలీజ్‌కు రెడీ

ABN , First Publish Date - 2021-10-12T06:16:02+05:30 IST

ఎన్‌ఐఏ ఏజెంట్‌ పాత్రలో హీరో కార్తికేయ నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌. ప్రస్తుతం నేపథ్య సంగీత పనులు జరుగుతున్నాయని...

రిలీజ్‌కు రెడీ

ఎన్‌ఐఏ ఏజెంట్‌ పాత్రలో హీరో కార్తికేయ నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌. ప్రస్తుతం నేపథ్య సంగీత పనులు జరుగుతున్నాయని, త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్రనిర్మాత ‘88’ రామారెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ... గండికోటలోని ఓ పురాతన ఆలయంలో దర్బార్‌ సెట్‌ వేసి కొన్ని సీన్లు తీశాం. మారేడుమిల్లిలోని రబ్బరు ఫారెస్టులో, హైదరాబాద్‌లోని ఓ డంప్‌ యార్డులో కొన్ని సీన్లు చిత్రీకరించాం. కార్తికేయ పాత్రచిత్రణ, ఆ సీన్లు హైలైట్‌ అవుతాయి. అతి త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ‘‘ఇదొక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌’’ అని దర్శకుడు శ్రీ సరిపల్లి తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆదిరెడ్డి .టి, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి.


Updated Date - 2021-10-12T06:16:02+05:30 IST