సెకండ్ షెడ్యూల్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటిస్తోన్న చిత్రం

ABN , First Publish Date - 2021-09-23T02:15:54+05:30 IST

రాజీవ్ సాలూరి, వర్ష విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభమైనట్లుగా

సెకండ్ షెడ్యూల్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటిస్తోన్న చిత్రం

రాజీవ్ సాలూరి, వర్ష విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభమైనట్లుగా మేకర్స్ ప్రకటించారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూరి ఓ ముఖ్యపాత్రలో నటిస్తుండగా సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి) మాట్లాడుతూ.. మా సంస్థలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కి మొదలుపెట్టుకుంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ అనుకున్న విధంగా బాగా జరిగింది. మా చిత్రానికి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ‌గారు సంగీతం అందిస్తుంటే.. సంచలన సంగీత దర్శకుడు కోటిగారు ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు అని తెలుపగా.. దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. టైటిల్‌తో పాటు చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం.. అన్నారు.

Updated Date - 2021-09-23T02:15:54+05:30 IST