ఆ హీరో సినిమాలో విలన్‌గా రఘు కుంచే
ABN , First Publish Date - 2021-08-05T02:49:10+05:30 IST
సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచే.. నటుడిగానూ అవతారమెత్తిన విషయం తెలిసిందే. ‘పలాస 1978’ సినిమాలో విలన్‌గా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందిన రఘు కుంచే.. ఇప్పుడు మరో హీరో

సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచే.. నటుడిగానూ అవతారమెత్తిన విషయం తెలిసిందే. ‘పలాస 1978’ సినిమాలో విలన్‌గా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందిన రఘు కుంచే.. ఇప్పుడు మరో హీరో కోసం విలన్‌గా మారుతున్నాడు. కమెడియన్, హీరో అయిన సప్తగిరి నటిస్తోన్న చిత్రం ‘గూడుపుఠాణి’. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.ఎమ్. కుమార్ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ‘నీలి నింగి తాకాలని’ అనే మెలోడీ సాంగ్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రతాప్ విద్య సంగీత సారధ్యంలో వచ్చిన ఈ పాట కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తాజాగా రఘు కుంచే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన పాత్ర ఈ చిత్రంలో వినూత్నంగా ఉంటుందని తెలిపారు. సప్తగిరి సరసన ‘90 ఎమ్.ఎల్’ హీరోయిన్ నేహా సోలంకి నటిస్తోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.