ప్రకాశ్‌రాజ్ మౌనవ్రతం.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2021-11-15T23:30:19+05:30 IST
ఆగస్ట్ నెలలో ఓ తమిళ సినిమా షూటింగ్లో ప్రకాశ్‌రాజ్ గాయపడిన సంగతి తెలిసిందే! హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకున్న ఆయన వేగంగా కోలుకున్నారు. ఆ తర్వాత ‘మా’ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల బిజీలో ఉన్న ఆయన తాజాగా పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఆగస్ట్ నెలలో ఓ తమిళ సినిమా షూటింగ్లో ప్రకాశ్‌రాజ్ గాయపడిన సంగతి తెలిసిందే! హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకున్న ఆయన వేగంగా కోలుకున్నారు. ఆ తర్వాత ‘మా’ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల బిజీలో ఉన్న ఆయన తాజాగా పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారాయన. ‘కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించా. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. ఐయామ్ రాకింగ్! అయితే వాకల్ కార్డ్స్‌కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అందుకే మౌనవ్రతం చేయబోతున్నా’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.