ఉత్కంఠను పెంచే మిస్సింగ్‌

ABN , First Publish Date - 2021-11-18T10:14:20+05:30 IST

‘మిస్సింగ్‌’ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమవుతున్నారు హర్ష నర్రా. శ్రీని జోస్యుల దర్శకత్వంలో భాస్కర్‌ జోస్యుల, లక్ష్మి శేషగిరిరావు నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న...

ఉత్కంఠను పెంచే మిస్సింగ్‌

‘మిస్సింగ్‌’ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమవుతున్నారు హర్ష నర్రా. శ్రీని జోస్యుల దర్శకత్వంలో భాస్కర్‌ జోస్యుల, లక్ష్మి శేషగిరిరావు నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హర్ష నర్రా సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘‘ఆకాశమంత ప్రేమ’ అనే లఘు చిత్రం, ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ ‘పెళ్లిగోల’ వెబ్‌సిరీస్‌లు నటుడిగా నాకు గుర్తింపు తెచ్చాయి. ‘మిస్సింగ్‌’లాంటి చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మిస్సింగ్‌ నేపథ్యంలో వచ్చిన గత చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎవరు మిస్సయ్యారు? ఎందుకు మిస్సయ్యారు అనేది ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తుంది. ఇలాంటి సినిమాను తెరపైన చూస్తేనే ప్రేక్షకుడు ఆస్వాదించగలడు. అందుకే ఓటీటీ ఆఫర్లు వచ్చినా థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. 


Updated Date - 2021-11-18T10:14:20+05:30 IST