‘ఇష్క్’తో రీ ఎంట్రీ ఇస్తోన్న టాప్‌ బ్యానర్‌

ABN , First Publish Date - 2021-01-08T22:55:51+05:30 IST

మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ప్రేక్షకులకు అందించిన ఈ బ్యానర్‌.. కొన్నాళ్లుగా సైలెంట్‌గా

‘ఇష్క్’తో రీ ఎంట్రీ ఇస్తోన్న టాప్‌ బ్యానర్‌

మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ప్రేక్షకులకు అందించిన ఈ బ్యానర్‌.. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మించేందుకు ఈ సంస్థ రెడీ అవుతోంది. అందులో భాగంగా 2021లో ఈ సంస్థ తమ తొలి చిత్రాన్ని ప్రకటించింది. ప్రజంట్‌ బిజీ హీరోగా మారిన యంగ్ హీరో తేజ స‌జ్జా హీరోగా, సంచలన నటి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వంలో 'ఇష్క్‌' అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని ఈ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మాతలు.


'ఇష్క్' అనే టైటిల్‌తో.. "నాట్ ఎ ల‌వ్ స్టోరీ" అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుండ‌గా, ట్యాగ్‌లైన్ మ‌రో అభిప్రాయాన్ని క‌లిగిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇండ‌స్ట్రీలోని ప్ర‌తిభావంతులైన టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీత బాణీలు స‌మ‌కూరుస్తుండ‌గా, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శ్రీ‌మ‌ణి పాట‌లు రాస్తున్నారు. ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియజేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది.



Updated Date - 2021-01-08T22:55:51+05:30 IST