'కప్పేల' తెలుగు రీమేక్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-07T20:54:30+05:30 IST

చిన్న చిత్రంగా మలయాళంలో విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన రీసెంట్‌ చిత్రాల్లో 'కప్పేల' ఒకటి. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులనును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకుంది. బుధవారం తెలుగు రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

'కప్పేల' తెలుగు రీమేక్‌ ప్రారంభం

చిన్న చిత్రంగా మలయాళంలో విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన రీసెంట్‌ చిత్రాల్లో 'కప్పేల' ఒకటి. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులనును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకుంది. తెలుగు నెటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసిన తర్వాత, బుధవారం తెలుగు రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. శారీ చంద్రశేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్‌ సినిమాకు క్లాప్‌ కొట్టగా నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు. యుక్త వయసులోని అమ్మాయిలను ప్రేమ పేరుతో కొందరు ఎలా మోసం చేస్తారు? అనే పాయింట్‌తో సినిమా తెరకెక్కుతుంది. స్వీకర్‌ ఆగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ తెలుగు రీమేక్‌కు 'బుట్టబొమ్మ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-07-07T20:54:30+05:30 IST