హీరోగా హరనాథ్ మనువడు
ABN , First Publish Date - 2021-10-21T06:51:00+05:30 IST
దివంగత నటుడు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనువడు విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సీతామనోహర శ్రీరాఘవ’. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం...

దివంగత నటుడు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనువడు విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సీతామనోహర శ్రీరాఘవ’. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. నిర్మాత ఎ.ఎం రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ ఇచ్చారు. ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు శ్రీమతి శ్యామల పాల్గొని యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘హరనాథ్ గారి స్ఫూర్తితో... సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది’ అని విరాట్ రాజ్ అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీ వత్సస కె. మాట్లాడుతూ ‘‘కె.జి.ఎఫ్ 2’, ‘సలార్’ చిత్రాలకు సంగీతం అందిస్తున్న రవి బసురూర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు’ అని తెలిపారు. చిత్ర నిర్మాత సుధాకర్ టి. మాట్లాడుతూ ‘‘వందన మూవీస్‌పై ఓ మంచి కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. రేవ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త నికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.