నవ్వించే గోవిందా!

ABN , First Publish Date - 2021-07-14T06:38:04+05:30 IST

‘దుర్మార్గుడు’ ఫేమ్‌ విజయ్‌కృష్ణ, ప్రియా శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రం ‘గోవిందా భజ గోవిందా’. బెక్కం వేణుగోపాల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు...

నవ్వించే గోవిందా!

‘దుర్మార్గుడు’ ఫేమ్‌ విజయ్‌కృష్ణ, ప్రియా శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రం ‘గోవిందా భజ గోవిందా’. బెక్కం వేణుగోపాల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ‘‘కుటుంబమంతా కలిసి చూసి, సంతోషంగా నవ్వుకునే హాస్యభరిత చిత్రమిది. విజయ్‌కృష్ణ చక్కగా నటించారు. ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన నేను, ఈ సినిమాతో దర్శకుడిగా, నిర్మాతగా పరిచయమవుతున్నా’’ అని సూర్య కార్తికేయ తెలిపారు. ఉపేంద్రతో కలిసి ఆయన చిత్రాన్ని నిర్మించారు.


Updated Date - 2021-07-14T06:38:04+05:30 IST