గణేశ్‌ వెంకట్రామన్‌ని డైరెక్ట్ చేస్తోన్న బాలీవుడ్‌ కెమెరామెన్‌

ABN , First Publish Date - 2021-02-26T03:01:11+05:30 IST

హీరోగా నటించిన చిత్రాలు చాలా తక్కువ. ఇపుడు మళ్ళీ హీరోగా ‘ఉన్‌ పార్వయిల్‌’ అనే చిత్రంలో నటించనున్నారు. పార్వతి నాయర్‌ హీరోయిన్‌

గణేశ్‌ వెంకట్రామన్‌ని డైరెక్ట్ చేస్తోన్న బాలీవుడ్‌ కెమెరామెన్‌

కోలీవుడ్‌: ‘అభియుం నానుమ్‌’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌ వెండితెరకు పరిచయమైన హీరో గణేశ్‌ వెంకట్రామన్‌‌. ఆ తర్వాత ‘ఉన్నైపోల ఒరువన్‌’, ‘కో’, ‘ఇవన్‌ వేరమాదిరి’, ‘తని ఒరువన్‌’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే, హీరోగా నటించిన చిత్రాలు చాలా తక్కువ. ఇపుడు మళ్ళీ హీరోగా ‘ఉన్‌ పార్వయిల్‌’ అనే చిత్రంలో నటించనున్నారు. పార్వతి నాయర్‌ హీరోయిన్‌. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ కెమెరామెన్‌ కబీర్‌లాల్‌ కోలీవుడ్‌లో తొలిసారి దర్శకుడుగా అడుగుపెడుతున్నారు.


తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో నిర్మితమయ్యే ఈ చిత్ర కథ రొమాటిక్‌ థ్రిల్లర్‌గా సాగనుంది. ఈ చిత్రంలో హీరో ఓ సైకలాజిస్టుగా, హీరోయిన్‌ పారిశ్రామికవేత్తగా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి హీరో గణేశ్‌ వెంకట్రామన్‌ మాట్లాడుతూ, ఇలాంటి పాత్ర కోసమే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్టు, ఈ చిత్రం షూటింగ్‌ ఉత్తరాఖండ్‌, డెహ్రాడూన్‌లలో జరుపుకుంటున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-02-26T03:01:11+05:30 IST