తమ సినిమా పోస్టర్స్‌ని గోడలకి అంటించుకున్న హీరో, హీరోయిన్

ABN , First Publish Date - 2021-11-16T23:29:34+05:30 IST

సినిమా ప్రమోషన్ విషయంలో దర్శకనిర్మాతల ఆలోచనలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈరోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దానిని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు అనేలా మారిపోయింది. అందుకే దర్శకనిర్మాతలు వినూత్న ప్రచారాలు

తమ సినిమా పోస్టర్స్‌ని గోడలకి అంటించుకున్న హీరో, హీరోయిన్

సినిమా ప్రమోషన్ విషయంలో దర్శకనిర్మాతల ఆలోచనలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈరోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దానిని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు అనేలా మారిపోయింది. అందుకే దర్శకనిర్మాతలు వినూత్న ప్రచారాలు చేస్తూ.. సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ‘రామ్ అసుర్’ చిత్రయూనిట్ కూడా అదే పంథాలో వెళుతోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లేందుకు వారు వినూత్నంగా ప్రచారం మొదలెట్టారు.


చిత్ర హీరోహీరోయిన్లు అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని.. ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా స్వయంగా జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి, మంచి కంటెంట్ ఉన్న మూవీ అని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, బస్టాండ్ వంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి తెలుపుతూ.. చిత్ర వాల్ పోస్టర్స్‌ను స్వయంగా వారే గోడలకి అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీని ప్రదర్శిస్తున్నారు. మరి వీరి స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. కాగా, వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 19న థియేటర్లలో విడుదలకాబోతోంది. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2021-11-16T23:29:34+05:30 IST