బిగ్ బాస్5 షురూ
ABN , First Publish Date - 2021-09-06T05:03:06+05:30 IST
అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఐదో సీజన్ ఆదివారం ‘స్టార్‌మా’లో ఆరంభమైంది. గాయకుడు శ్రీరామచంద్ర, డాన్స్ మాస్టర్లు యానీ, నటరాజ్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, యూట్యూబర్లు...

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఐదో సీజన్ ఆదివారం ‘స్టార్‌మా’లో ఆరంభమైంది. గాయకుడు శ్రీరామచంద్ర, డాన్స్ మాస్టర్లు యానీ, నటరాజ్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, యూట్యూబర్లు సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్, సరయు, నటీనటులు ప్రియ, ఉమాదేవి, విజయ్ సన్నీ, లహరి షెహరి, లోబో, హమీదా, విశ్వ, మానస్, శ్వేతావర్మ, సూపర్ మోడల్ జెస్సీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక... మొత్తం 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. వాళ్లందరూ లోపలకు వెళ్లేముందు.... ఒక్కొక్కర్నీ నాగార్జున వీక్షకులకు పరిచయం చేశారు. వంద రోజులకు పైగా ఈ షో కొనసాగుతుందని ఆయన తెలిపారు. తొలి రోజు కంటెస్టెంట్లకు చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, శని - ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. ‘ఇక్కడ కిక్ టన్నుల కొద్దీ ఉంటుంది’ అని షోపై నాగార్జున అంచనాలు పెంచారు.