రిస్క్‌ అనిపించినా తప్పలేదు

ABN , First Publish Date - 2021-11-24T05:45:00+05:30 IST

‘‘మహిళలపై లైంగిక దాడులు, వర్ణ వివక్ష నేపథ్యంలో వాస్తవ సంఘటలన స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. అలాగని అశ్లీలతకు తావు ఇవ్వలేదు. నేను రాసుకున్న విధంగా కథ తెరపైకి రావాలంటే...

రిస్క్‌ అనిపించినా తప్పలేదు

‘‘మహిళలపై లైంగిక దాడులు, వర్ణ వివక్ష నేపథ్యంలో వాస్తవ సంఘటలన స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. అలాగని అశ్లీలతకు తావు ఇవ్వలేదు. నేను రాసుకున్న విధంగా కథ తెరపైకి రావాలంటే సొంతంగా నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించాలని భావించాను. కొంచెం రిస్క్‌ అనిపించినా తప్పలేదు’’ అన్నారు డాక్టర్‌ మోహన్‌. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘1997’. ఈ నెల 26న థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు. ‘‘సందేశం చెబితే ప్రేక్షకులు స్వీకరించే స్థితి లేదు.  అందుకే ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా సినిమాను సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మలిచాను. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సంభాషణలు ఉంటాయి.  సెన్సార్‌సభ్యులు మంచి కథాంశంతో సినిమా తీశారని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో నేను పోలీసాఫీసర్‌గా కనిపిస్తాను. కోటి గారు అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధానాకర్షణ. అలాగే మంగ్లీ పాడిన ‘ఏమి బతుకు’ సాంగ్‌ జనాల్లోకి వెళ్లింది. నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కూడా పోలీసు అధికారుల పాత్రల్లో అలరిస్తారు’’ అన్నారు. 


Updated Date - 2021-11-24T05:45:00+05:30 IST