రాజేంద్రప్రసాద్ మరో షాక్
ABN , First Publish Date - 2021-02-14T01:27:10+05:30 IST
అవును...నిజమే. మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. కొందరు సినిమా స్ర్కీన్‌కి, ప్రేక్షకులకీ ఇచ్చే షాకులు మాములుగా ఉండవు. ఒక షాక్ నుంచి తేరుకునేలోగా మరో

అవును...నిజమే. మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. కొందరు సినిమా స్ర్కీన్‌కి, ప్రేక్షకులకీ ఇచ్చే షాకులు మాములుగా ఉండవు. ఒక షాక్ నుంచి తేరుకునేలోగా మరో షాక్ రెడీ అవుతుంది. నటకిరీటిగా పేరు పొందిన డా. రాజేంద్రప్రసాద్ తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని క్యారెక్టర్స్ చేసి రికార్డు మీద రికార్డు క్రియేట్ చేసుకుంటూనే నలభై ఏళ్ళగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్న మేటి నటుడు. ఎర్రమందారం, ఆ నలుగురు...ఒకటా రెండా...కొన్ని సందర్భాలలో అయితే పాత్రలో లేని జీవాన్ని తన టాలెంట్‌తో, మెరిట్‌తో బ్రతికించిన మైలురాళ్ళు రాజేంద్రప్రసాద్ జీవితంలో ఎన్నో, ఎన్నెన్నో. ఇప్పుడు మరోసారి ఆయన మరో షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అదీ 'క్లైమాక్స్' చిత్రంలోని పాత్రతో.
ఎవ్వరూ ఆయన చేసే పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. ఆయనే చెప్పగలరు. నిజంగా అది మంచి క్యారెక్టర్ అయితే ఆయనే రొమ్ము విరుచుకుని మరీ చెప్తారు. లేదంటే ఓకే ఫరవాలేదు అని ఆయనే సరిపెట్టేస్తారు. 'క్లైమాక్స్' సినిమా గురించి ఆయన సగర్వంగా చెప్పారు. 'క్లైమాక్స్' సినిమాలో నా పాత్ర చూసి షాక్ అవుతారు....అని రాజేంద్రప్రసాద్ అన్నారంటే గ్యారెంటీగా ఆ పాత్రలో ఏదో అద్భుతం ఉందనమాటే. గతంలో డ్రీమ్ లాటి సినిమాని డైరెక్ట్ చేసి అందరి చేత శెభాష్ అనిపించుకున్న భవానీ శంకర్ తాజాగా 'క్లైమాక్స్' చిత్రంతో మరో అద్భుతమేదో మోసుకొస్తున్నాడని అందరూ ఆశిస్తున్నారు. ఊహిస్తున్నారు. అందుకు రాజేంద్రప్రసాద్ చెప్పిన మాటలే నిదర్శనాలు.

లేకుంటే నలభై ఏళ్ళగా చేసిన పాత్ర చేయకుండా భిన్నవిభిన్న పాత్రలు చేస్తూ, ఏ పాత్రకా పాత్రనే ఓ మైలురాయిగా నిలుపుకుంటూ అనూహ్యమైన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకున్న రాజేంద్రప్రసాద్ ఇప్పుడు కొత్తగా ఓ పాత్రను గురించి ఆ విధంగా వ్యాఖ్యానించారంటేనే.. అదే మొదటి షాక్. సినిమా నిడివి కేవలం గంటన్నర మాత్రమే. అయితేనేం.. మంచి నెరేషన్.. రాజేంద్రప్రసాద్ లాంటి వెటరన్.. వెరసి క్లైమాక్స్ చిత్రం మరో గొప్ప అనుభవం కానుంది ప్రేక్షకులకి.