హీరోయిన్గా ఆమని మేనకోడలు
ABN , First Publish Date - 2021-08-24T02:46:30+05:30 IST
టాలీవుడ్లో హీరోయిన్గా, నటిగా ఆమని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె నట వారసురాలుగా, కథానాయికగా హ్రితిక శ్రీనివాసన్ ఎంట్రీ ఇస్తున్నారు.

టాలీవుడ్లో హీరోయిన్గా, నటిగా ఆమని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె నట వారసురాలుగా, కథానాయికగా హ్రితిక శ్రీనివాసన్ ఎంట్రీ ఇస్తున్నారు. హ్రితికకు సినీ పరిశ్రమ కొత్తదేం కాదు. బాలనటిగా మూడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు తెలుగులో ‘అల్లంత దూరాన’ అనే సినిమా ద్వారా హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీంతో పాటు తమిళం, కన్నడలోనూ హ్రితిక సినిమా చేస్తుండటం విశేషం. ‘అల్లంత దూరాన’ సినిమా విషయానికి వస్తే.. చలపతి పువ్వల డైరెక్టర్గా ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహనరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ను డైరెక్టర్ బాబి విడుదల చేశారు.