ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం.. సినీ ప్రముఖుల సంతాపం..
ABN , First Publish Date - 2021-04-27T15:10:41+05:30 IST
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేమూరి కనకదుర్గ మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు.

ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వేమూరి కనకదుర్గ మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. అలాగే నటుడు నిర్మాత మంచు మోహన్‌బాబు, ఆయన కుమార్తే మంచు లక్ష్మీప్రసన్న, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, నందమూరి బాలకృష్ణ, నటుడు నిర్మాత బండ్ల గణేష్ తమ సంతాపం తెలిపారు.
నా మిత్రుడు, ఆత్మబంధువు, శ్రేయోభిలాషి అయిన శ్రీ వేమూరి రాధాకృష్ణగారి భార్య శ్రీమతి వేమూరి కనకదుర్గగారు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తెలిసి ఎంతో బాధేసింది. ఆమె అకాల మరణానికి చింతిస్తూ.. ఆమె ఆత్మ, పుణ్యలోకాలకు చేరుకోవాలని కోరుతూ.. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
-అశ్వనీదత్ చలసాని.
నా చిరకాల మిత్రుడు, సన్నిహితుడైన వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో మృతిచెందడం బాధాకరం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ షిర్డీ సాయినాధుని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-మోహన్ బాబు మంచు