`ఏ1 ఎక్స్‌ప్రెస్` వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2021-02-21T17:01:37+05:30 IST

హాకీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్` ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

`ఏ1 ఎక్స్‌ప్రెస్` వచ్చేస్తోంది!

హాకీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్` ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డైరెక్టర్ డెన్నిస్ జీవన్ రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, రెండు పాటలకు అద్భుతమైన స్పందన దక్కింది. ఇక, ట్రైలర్ య్యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కించుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కాబోతోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఒక వారం ఆలస్యమైంది. ఈ సినిమాకు సందీప్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  

Updated Date - 2021-02-21T17:01:37+05:30 IST