తమ పెళ్లికి హాజరు కాలేనివారిని స్పెషల్ గిఫ్ట్‌తో సర్ ప్రైజ్ చేసిన రాజ్ కమార్ రావ్, పత్రలేఖ
ABN , First Publish Date - 2021-11-27T02:58:07+05:30 IST
బాలీవుడ్‌లో ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రాజ్ కుమార్ రావ్, పత్ర లేఖ ఈ మధ్యనే చంఢీగఢ్‌లో వివాహం చేసుకున్నారు.

బాలీవుడ్‌లో ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రాజ్ కుమార్ రావ్, పత్ర లేఖ ఈ మధ్యనే చంఢీగఢ్‌లో వివాహం చేసుకున్నారు. తమ పెళ్లికి దగ్గరి బంధువులతో పాటు సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఈ పెళ్లికి బాలీవుడ్ సెలెబ్రిటీలైన ఫరా ఖాన్, హన్స్‌ల్ మెహతా తదితరులు హాజరయ్యారు. తమ వివాహానికి హాజరు కాలేని వారికి ఆ జంట స్పెషల్ సర్‌ప్రైజ్‌గా గిఫ్ట్‌ను పంపించింది.
సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన మసాబా గుప్తా కూడా వీటిని అందుకున్న వారిలో ఉన్నారు. ఆ గిఫ్ట్‌లో మోతీచూర్ లడ్డూతో పాటు ఒక మెసేజ్ నోట్ ఉంది. మాసాబా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ పిక్‌లను పోస్ట్ చేసింది. ‘‘ మేం 11ఏళ్లుగా ఒకరికి మరొకం తెలుసు. చంఢీగఢ్‌లో మేం పెళ్లి చేసుకున్నాం. ఈ ప్రత్యేకమైన రోజుకు మీరు హాజరు కాలేక పోయినందుకు చింతిస్తున్నాం. పెళ్లి చేసుకున్న సందర్భంగా చిన్న గిఫ్ట్‌ను పంపిస్తున్నాం. ప్రేమతో..పత్రలేఖ, రాజ్ కమార్ ’’ అని ఆ మెసేజ్ నోట్‌లో ఉంది. ఆ మెసేజ్ నోట్‌ను మసాబా గుప్తా సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటో కింద ‘‘ కంగ్రాచ్యులేషన్స్ ’’ అని ఆమె కామెంట్ కూడా చేసింది.