‘ఘాజి’ దర్శకుడి బాలీవుడ్ ఫిల్మ్ టైటిల్ ఫిక్సయింది
ABN , First Publish Date - 2021-07-20T02:51:50+05:30 IST
టాలీవుడ్ నుంచి మరో యంగ్ దర్శకుడు బాలీవుడ్‌కు పయనమవుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సందీప్ వంగా(అర్జున్ రెడ్డి ఫేమ్), గౌతమ్ తిన్ననూరి (జెర్సీ ఫేమ్), శైలేష్ కొలను (హిట్ మూవీ ఫేమ్) వంటి యంగ్ దర్శకులు

టాలీవుడ్ నుంచి మరో యంగ్ దర్శకుడు బాలీవుడ్‌కు పయనమవుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సందీప్ వంగా(అర్జున్ రెడ్డి ఫేమ్), గౌతమ్ తిన్ననూరి (జెర్సీ ఫేమ్), శైలేష్ కొలను (హిట్ మూవీ ఫేమ్) వంటి యంగ్ దర్శకులు బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్‌లో ‘ఘాజి, అంతరిక్షం’ వంటి చిత్రాలను రూపొందించిన సంకల్ప్ రెడ్డి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన 'శక్తి', 'ఊసరవెల్లి', కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన 'తుపాకి' చిత్రాల్లో విలన్‌గా కనిపించిన విద్యుత్ జమ్వాల్‌ను సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నారు. విద్యుత్ జమ్వాల్ హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఐబీ 71’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రంతో విద్యుత్ జమ్వాల్ నిర్మాతగానూ మారుతుండటం విశేషం. ఇందులో ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.