నాకు ‘పద్మశ్రీ’ వచ్చినందుకు.. ఆమే ఎక్కువ సంతోషించింది: ఏక్తా కపూర్
ABN , First Publish Date - 2021-11-11T01:34:10+05:30 IST
హిందీ టీవీ సీరియల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా ఆర్ కపూర్ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కంటెంట్ ఆధారిత సినిమాటిక్ ప్రాజెక్ట్‌లకు ఆవల విస్తరించారు. వెల్నెస్కు, ఆధ్యాత్మికతను జోడించి ‘ఏక్’ అంటూ హోమ్

హిందీ టీవీ సీరియల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా ఆర్ కపూర్ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కంటెంట్ ఆధారిత సినిమాటిక్ ప్రాజెక్ట్‌లకు ఆవల విస్తరించారు. వెల్నెస్కు, ఆధ్యాత్మికతను జోడించి ‘ఏక్’ అంటూ హోమ్ డెకార్, ఫర్నిషింగ్ బ్రాండ్‌ను విడుదల చేశారామె. గ్లాన్స్‌కు చెందిన లైవ్ కామర్స్ వీడియో ప్లాట్‌ఫామ్ రోపోసోతో భాగస్వామ్యం చేసుకుని దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించబోతున్నారు. ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగిన జీవనశైలి బ్రాండ్ ‘ఏక్’ అని తెలిపిన ఏక్తా, మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక వారసత్వం, వెల్నెస్ సంప్రదాయాల స్ఫూర్తితో ఈ ఉత్పత్తులు ఉంటాయన్నారు.
రాజస్తాన్‌లోని బాగ్డీ మొదలు పలు ప్రాంతాల చేనేత సంప్రదాయలను దేశమంతా తీసుకువెళ్లే ప్రయత్నం ఈ బ్రాండ్ ద్వారా చేస్తున్నామన్నారు. ఆ క్రమంలోనే జ్యోతిష్యం, ఆధ్యాత్మికత పరంగా తన నమ్మకాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం కూడా చేయనని వెల్లడించారు. బాలాజీ టెలిఫిల్మ్స్ కు, ఏక్కు సంబంధం ఉంటుందా అని అడిగినప్పుడు తప్పకుండా, అయితే అది మార్కెటింగ్ పరంగా మాత్రమే అని స్పష్టం చేశారు. రోపోసోతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా తొలి సంవత్సరం ఎంత ఆదాయం లక్ష్యంగా చేసుకున్నారన్నప్పుడు.. భారతీయ కళాకారులకు మద్దతునందించాలనే కోరికతోనే ఈ బ్రాండ్ తీసుకువచ్చామని, రెవిన్యూ లక్ష్యాల కన్నా తమ ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లడంపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు.
ఈ క్రమంలోనే పద్మశ్రీ పురస్కారం అందుకోవడం గురించి మాట్లాడుతూ.. ముందుగా తాను నమ్మలేదన్నారు. కరణ్ తనకు ఈ విషయం చెప్పాడంటూ దేశం నుంచి అత్యున్నత గౌరవం పొందడమనేది అతి పెద్ద బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తనకు ఈ అవార్డు రావడం.. వాళ్ల అమ్మ (శోభా కపూర్)కే ఎక్కువ ఆనందం కలిగించిందంటూ దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి ఆమె అని కొనియాడారు.