ఆ సినిమా బ్రిటీష్ వారిపై ద్వేషాన్ని ప్రదర్శించింది... అందుకే రిజెక్ట్ చేశాం...

ABN , First Publish Date - 2021-10-25T04:13:23+05:30 IST

బ్రిటీష్ వారి పట్ల ‘సర్దార్ ఉదమ్’ సినిమా ద్వేషాన్ని ప్రదర్శించింది. అందుకే, ఆ చిత్రాన్ని ఆస్కార్స్ బరిలోకి పంపేందుకు జ్యూరీ అంగీకరించలేదు అంటున్నారు...

ఆ సినిమా బ్రిటీష్ వారిపై ద్వేషాన్ని ప్రదర్శించింది... అందుకే రిజెక్ట్ చేశాం...

బ్రిటీష్ వారి పట్ల ‘సర్దార్ ఉదమ్’ సినిమా ద్వేషాన్ని ప్రదర్శించింది. అందుకే, ఆ చిత్రాన్ని ఆస్కార్స్ బరిలోకి పంపేందుకు జ్యూరీ అంగీకరించలేదు అంటున్నారు ఇంద్రదీప్ దాస్‌గుప్త. భారత్ తరుఫున 94వ అకాడమీ అవార్డ్స్‌కి అధికారిక చిత్రాన్ని పంపేందుకు ఏర్పాటైన జ్యూరీలో ఆయన కూడా సభ్యులు. 


‘‘చరిత్ర మరిచిన ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి, సినిమా తీసేందుకోసం, చేసిన ఓ నిజాయితీ గల ప్రయత్నమే ‘సర్ధార్ ఉదమ్’. కానీ, ప్రస్తుత గ్లోబలైజేషన్ శకంలో ద్వేషాన్ని ప్రతిబింబించటం అంత సమర్థనీయం కాదు...’’ అన్నారు జ్యూరీ మెంబర్ ఇంద్రదీప్ దాస్‌గుప్త. 


మొత్తం 13 చిత్రాల్ని వెనక్కి తోసి తమిళ చిత్రం ‘కూజంగల్’ భారత్ తరుఫున ఆస్కార్స్‌కి అఫీషియల్ ఎంట్రీ సాధించింది. ‘కూజంగల్’ డైరెక్టర్ వినోద్ సారథ్యంలో నయనతార, విఘ్నశ్ శివన్ నిర్మించారు.  

Updated Date - 2021-10-25T04:13:23+05:30 IST