నాగచైతన్యకి హ్యాండిచ్చిన పరశురామ్?

ABN , First Publish Date - 2020-03-19T23:05:35+05:30 IST

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని నిరూపించింది 'గీత గోవిందం'. తక్కువ బడ్జెట్‌లో ...

నాగచైతన్యకి హ్యాండిచ్చిన పరశురామ్?

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని నిరూపించింది 'గీత గోవిందం'. తక్కువ బడ్జెట్‌లో ఏడాదిన్నర క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన పరశురామ్ ఏకంగా మహేశ్‌బాబుతో సినిమాకి సిద్ధమయ్యాడు.


ఏడాదిపాటు మహేశ్‌బాబుని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు సిద్ధం చేశాడు పరశురామ్. చివరకు మహేశ్‌ ఆ సబ్జెక్టును పక్కన పెట్టేశాడు. దాంతో నాగచైతన్యతో సినిమాకి రెడీ అయ్యాడు పరశురామ్. నాగచైతన్య 20వ చిత్రంగా 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట పరశురామ్‌తో సినిమా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా ఓ కొలిక్కి రావడంతో చై-పరశురామ్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళుతుందని భావించారు. అయితే గతంలో నో చెప్పిన ప్రిన్స్‌ మళ్లీ లైన్‌లోకి రావటంతో పరశురామ్‌ అటువైపు పరుగెట్టాడు.


పరశురామ్ తనకోసం సిద్ధం చేసిన కథలో కొన్ని కరెక్షన్స్‌ చెప్పాడట మహేశ్. ప్రస్తుతం మహేశ్‌బాబు సినిమా స్క్రిప్టులో ఛేంజెస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారట పరశురామ్ అండ్ టీమ్. పనిలోపనిగా ప్రిన్స్‌తో తన డ్రీమ్ ప్రాజెక్టుకోసం.. నాగచైతన్య సినిమాని పక్కనపెట్టేసే ఆలోచనలో ఉన్నాడట పరశురామ్. ఇప్పటికే 14 రీల్స్‌ ప్లస్ ఆఫీసు ఖాళీ చేసి మహేశ్‌బాబుతో సినిమాని నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్‌కి షిప్టయ్యాడనేది ఫిల్మ్‌ నగర్ టాక్. మరి.. చైతన్యకి హ్యాండిచ్చి మహేశ్‌తో ప్రొసీడ్ అవ్వబోతున్న పరశురామ్ మహేశ్ ఎలాంటి తోడ్పాటు అందిస్తాడో చూడాలి.

Updated Date - 2020-03-19T23:05:35+05:30 IST