‘కప్పేళ’ రీమేక్‌లో హీరోయిన్ ఖరారు..?
ABN , First Publish Date - 2020-11-26T01:30:10+05:30 IST
లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల ఆదరణను పొందిన సినిమాల్లో మలయాళ చిత్రం ‘కప్పేళ’ ఒకటి. దీన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హక్కులను దక్కించుకుంది

లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల ఆదరణను పొందిన సినిమాల్లో మలయాళ చిత్రం ‘కప్పేళ’ ఒకటి. దీన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హక్కులను దక్కించుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల మధ్య నడిచే కథాంశంతో, చిన్నపాటి మెసేజ్‌తో తెరకెక్కిన చిత్రమిది. తెలుగులో విశ్వక్‌సేన్, నవీన్ చంద్ర ఈ పాత్రల్లో నటిస్తారు. కాగా, హీరోయిన్ ఎవరనే దానిపై నిర్మాతలు చాలానే ఆలోచించారు. ‘ఉప్పెన’ ఫేమ్ క్రితి శెట్టిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడగటంతో చివరకు ఆమె స్థానంలో మరో మలయాళీ అమ్మాయి అనిఖ సురేంద్రను తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారట. తమిళంలో అజిత్ హీరోగా చేసిన ‘ఎన్నై అరిందాల్(ఎంతవాడుగానీ), విశ్వాసం’ సినిమాల్లో కూతురు పాత్రలో అనిఖ మెప్పించింది. ఈమె ‘కప్పేళ’ రీమేక్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే..