ఫుల్ స్వింగ్‌లో రెడీ అవుతోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’
ABN , First Publish Date - 2020-11-17T23:01:10+05:30 IST
యంగ్ హీరో సందీప్ కిషన్, క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి
యంగ్ హీరో సందీప్ కిషన్, క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తోన్న చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపుపొందిన ఈ చిత్రంలోని హిప్ హాప్ తమిళ స్వరాలు కూర్చిన 'సింగిల్ కింగులం' సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్టయింది. ఇండియాలోనే అతిపెద్ద, ఉత్తమ హాకీ స్టేడియం అయిన పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' క్లైమాక్స్ సీక్వెన్స్‌లను పూర్తి చేశారు. భారతదేశపు టాప్ హాకీ ఫిలిమ్స్ అయిన 'చక్ దే ఇండియా', 'సూర్మ' షూటింగ్‌లను జరిపింది ఈ స్టేడియంలోనే కావడం గమనార్హం.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌లు ఫెంటాస్టిక్‌గా వచ్చాయని, సినిమాకి ఇవి పెద్ద హైలైట్ అవనున్నాయని చిత్రయూనిట్ తెలుపుతుంది. ఈ సీక్వెన్స్‌లో నటించడం కోసం గత ఆరు నెలలుగా హాకీలో శిక్షణ తీసుకున్నారట హీరో సందీప్ కిషన్. ఆ ట్రైనింగ్‌కు సంబంధించి ఇటీవల ఆయన షేర్ చేసిన వీడియోలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. చిత్రంలో హాకీ ఆడే సీన్లలో ఒక ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్ లాగా ఆయన ఆడటం కనిపిస్తుంది. క్లైమాక్స్ పూర్తయిన సందర్భంగా హీరో సందీప్ కిషన్ ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ''హాకీ ట్రైనింగ్‌లో 6 నెలలు.. క్యారెక్టర్‌లో దాదాపు ఒక ఏడాదిగా ఉండటం.. 14 కిలోల బరువు తగ్గడం.. అఫ్‌కోర్స్ కొవిడ్ భయపెడుతుండగానే ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాల్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకం చిత్రమైన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' క్లైమాక్స్ ఎట్టకేలకు పూర్తి చేశాం. ఇంకొక్క రోజు షూటింగ్ మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది" అని సందీప్ కిషన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది.