బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్!

ABN , First Publish Date - 2020-09-04T00:09:00+05:30 IST

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు

బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్!

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఎస్పీబీకి వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. 


మరోవైపు బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నాన్న ఆరోగ్యం వరుసగా నాలుగో రోజూ నిలకడగా ఉందని, వచ్చే సోమవారానికి ఆయన ఆరోగ్యం విషయంలో శుభవార్త వెలువడుతుందని ఆశిస్తున్నానని చరణ్ పేర్కొన్నారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. 

Updated Date - 2020-09-04T00:09:00+05:30 IST