‘సెబాస్టియన్ పి.సి. 524’ గ్లింప్స్ వదిలిన లావణ్య త్రిపాఠి
ABN , First Publish Date - 2020-12-26T02:30:52+05:30 IST
‘రాజావారు రాణివారు’చిత్రంతో హీరోగా పరిచయమైన నటుడు కిరణ్ అబ్బవరం. పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేసిన చిత్రమది. ఆ చిత్రంలోని తన
‘రాజావారు రాణివారు’చిత్రంతో హీరోగా పరిచయమైన నటుడు కిరణ్ అబ్బవరం. పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేసిన చిత్రమది. ఆ చిత్రంలోని తన నటనతో కిరణ్ మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ చిత్రం తర్వాత కథానాయకుడిగా రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలనై పాటలు చాలా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన నటిస్తోన్న మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’. కొత్త తరహా కథతో రూపొందుతున్న ఈ వినూత్న చిత్ర గ్లింప్స్‌ను డిసెంబర్ 25, శుక్రవారం సాయంత్రం ప్రముఖ కథానాయిక లావణ్యా త్రిపాఠి విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా కథానాయిక లావణ్యా త్రిపాఠి ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే.. నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రంగా తెలుస్తుంది. గేటు దగ్గర్నుంచి వెళుతూ చర్చిని, తర్వాత జీసస్‌ను చూపించి, ఆ తర్వాత హీరో కిరణ్ అబ్బవరాన్ని చూపించారు. నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ గ్లింప్స్‌లో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్’, ‘నిజం ఎప్పటికీ దాగదు’ వంటి కోట్స్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించనున్నారనేది ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మొదట గడ్డంతో కనిపించిన అతను, ఆ తర్వాత పోలీస్ డ్రస్‌లో క్లీన్ షేవ్‌తో కనిపించారు. సినిమాలో క్రిస్మస్ రోజున జన్మించిన క్రిస్టియన్ యువకుడు సెబాస్టియన్‌గా కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. అందుకని, గ్లింప్స్ చివర ‘హ్యాపీ బర్త్‌డే సెబా’ అని పేర్కొన్నారు.