గ్రాఫిక్స్ కాదు.. రియల్ బేబీ బంప్‌తో హీరోయిన్
ABN , First Publish Date - 2020-10-12T01:35:52+05:30 IST
'నువ్వు నేను, శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నేనున్నాను' వంటి చిత్రాలలో నటించిన అనిత అందరికీ గుర్తుండే ఉంటుంది. 2013లో ఈ భామ సినిమాలను

'నువ్వు నేను, శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నేనున్నాను' వంటి చిత్రాలలో నటించిన అనిత అందరికీ గుర్తుండే ఉంటుంది. 2013లో ఈ భామ సినిమాలను వదిలేసి పారిశ్రామికవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. పిల్లల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తీసుకుని, కొనాళ్ల పాటు పిల్లలను వద్దనుకున్న ఈ జంట ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనిత ప్రెగ్నెంట్. ఈ విషయం కొన్ని రోజులు ముందు బయటికి వచ్చినప్పటి వారు ఎక్కడా స్పందించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమే చెబుతూ.. వారు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
తాజాగా ఈ జంట విడుదల చేసిన ఓ వీడియో హాట్ టాపిక్ అవుతుంది. ఈ వీడియోలో వారిద్దరూ ముందు ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు తల్లి కాబోతున్నట్లుగా అనిత బేబీ బంప్‌ని చూపించడం వంటివి చూపించారు. మా కుటుంబంలోకి రాబోతున్న కొత్త అతిథి కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లుగా అనిత తెలిపితే.., అనిత బేబీ బంప్ చూపిస్తూ.. ఇది గ్రాఫిక్స్ కాదు, నిజమైనది అని రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వీరు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.