ఫస్ట్ టైమ్ పోలీసు యూనిఫామ్‌లో..: శ్రద్ధాదాస్
ABN , First Publish Date - 2020-08-31T21:51:20+05:30 IST
ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ పడితే వచ్చే కిక్కే వేరప్పా. ఆ ఫీలింగ్ నిజంగా అద్భుతం. కొందరి స్వార్థం వల్ల మనుషుల దృష్టిలో పోలీస్ వీక్ అవుతున్నాడు కానీ.. లేదంటే పోలీస్ అనే

ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ పడితే వచ్చే కిక్కే వేరప్పా. ఆ ఫీలింగ్ నిజంగా అద్భుతం. కొందరి స్వార్థం వల్ల మనుషుల దృష్టిలో పోలీస్ వీక్ అవుతున్నాడు కానీ.. లేదంటే పోలీస్ అనే పదానికి ఉన్న గౌరవమే వేరు. అందుకే సినిమాల్లో హీరోలు పోలీస్ డ్రస్‌లో కనిపిస్తే చాలు.. ప్రతి ఒక్కరూ అలాగే ఇమిటేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ తొలిసారి ఖాకీ డ్రస్ ధరించిన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? ఇంకెవరు హీరోయిన్ శ్రద్ధాదాస్.
కరోనా టైమ్‌లో ఫస్ట్ టైమ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని తెలుపుతూ.. ఆమె ఖాకీ డ్రస్సులో ఉన్న కొన్ని ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘పూణేలో ఒక హిందీ వెబ్ సిరీస్ కోసం ఈ మహమ్మారి టైమ్‌లో మొదటిరోజు షూట్‌లో పాల్గొన్నాను. ఫస్ట్ టైమ్ ఇండియన్ పోలీస్ యూనిఫామ్ ధరించాను. చాలా సంతోషంగా ఉంది..’’ అని శ్రద్ధాదాస్ తన ట్వీట్‌లో పేర్కొంది.