తన పేరుతో అమ్మాయిలకు వల.. డైరెక్టర్ అజయ్ భూపతి ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-07-03T18:51:29+05:30 IST
సోషల్ మీడియా పెరిగిన తర్వాత మోసాలు చేసే కేటుగాళ్లు తమ విస్తృతిని పెంచుకుంటున్నారు. పలు రూపాల్లో అమయాకులను మోసం చేస్తున్నారు.
సోషల్ మీడియా పెరిగిన తర్వాత మోసాలు చేసే కేటుగాళ్లు తమ విస్తృతిని పెంచుకుంటున్నారు. పలు రూపాల్లో అమయాకులను మోసం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. తాము సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ కేటుగాడు ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల వివరాలు సేకరించారు. అమ్మాయిలతో వాట్సప్ చాటింగ్ చేస్తూ.. తాను ‘ఆర్.ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి అని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. త్వరలో తాను హీరో విజయ్ దేవరకొండ, విశాల్‌లతో తీయబోయే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. కొందరి నుండి న్యూడ్ ఫొటోస్ కూడా సేకరించిన ఈ మోసగాడు.. వారిని వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం డైరెక్టర్ అజయ్ భూపతి వరకు వెళ్లింది. తన పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అజయ్ భూపతి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.