‘గోల్డెన్‌ హ్యాండ్‌ గోల్డీ  గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

గోల్డీ  నిస్సి  బెంగళూరులో పుట్టారు. హైస్కూల్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకూ హైదరాబాద్‌లోనే చదివారు.\

జోన్స్‌తో ఎక్కువ లవ్‌స్టోరీస్‌ల్లో నటించారు. ఆన్ స్క్రీన్ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందని అందరూ అంటుంటారు.

చిన్నప్పటి నుంచి కల్చరల్‌ యాక్టివిటీస్‌ ఎక్కువ. అదే యాక్టింగ్‌ వైపు తీసుకొచ్చింది.  

10 నిమిషాల యూట్యూబ్‌ వీడియోలు, ‘మ్యాడ్‌ హౌస్‌’, ‘పెళ్లి గోల’ వంటి వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌  ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

తమడ, వైరల్లీ, ఇన్ఫినిటమ్‌, క్యాప్‌డీటీ.. ఇలా పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌  చేస్తూ పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు ఇదే ఆమె ప్యాషన్‌గా మారింది.

గోల్డీకి రొమాంటిక్‌ కామెడీ జానర్‌ అంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కువగా ఆ జానర్‌ వీడియోలే చేశారు.

రవితేజతో ‘గోల్డెన్‌ హ్యాండ్‌ గోల్డీ’ చేసినప్పటి నుంచి అందరూ ‘గోల్డెన్‌ హ్యాండ్‌ గోల్డీ’ అని పిలుస్తున్నారు.

ప్రస్తుతం ఈ వృత్తిలో సంతృప్తిగా ఉన్న గోల్డీ.. చదువుకు సంబంధించిన జాబ్‌ వైపు వెళ్లాలనుకోవడం లేదు

ఇకవేళ ఇక్కడ రోజులు బాగోకపోతే కార్పొరేట్‌ వరల్డ్‌ కాకుండా ఇంకో ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటానంటున్నారు

గోల్డీ యాక్ట్‌ చేసే ప్రతి కథని తన తల్లి వింటారు. అది చెయొచ్చా, లేదా అన్న విషయంలో కూడా గైడ్‌ చేస్తారు. అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకం, స్వేచ్చని ఎప్పటికీ పోగొట్టుకోను. 

చిత్రాంగద, గర్ల్‌ ఫ్రెండ్‌ కొలీగ్‌ అయితే, సర్కాస్టిక్‌ గర్ల్‌ఫ్రెండ్‌, మ్యాడ్‌ హౌస్‌, బ్యూటీ అండ్‌ ద బాస్‌, మొగుడ్స్‌ పెళ్లామ్స్‌,   ట్రయాంగిల్‌ పెళ్లి చూపులు షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

చాంగురే బంగారు రాజా, మహానటులు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి వెండితెరపై కనిపించాలన్న తన కోరిక తీర్చుకున్నారు