త్రిష పుట్టినరోజు స్పెషల్.. ఈ విషయాలు తెలుసుకోండి..

నటిగా త్రిష సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా  రాణిస్తూ ఉంది.

1983 మే 4న చెన్నైలో కృష్ణన్‌, ఉమ దంపతులకు జన్మించింది.

బ్యాచిలర్‌ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) చదివింది. మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో కెరీర్ ప్రారంభించింది.

1999లో మిస్‌ చెన్నై కిరీటం దక్కించుకుంది. 2001లో మిస్‌ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్‌ టైటిల్‌ కూడా అందుకుంది.

చిన్నతనంలో సైకాలజిస్టు అవ్వాలనుకున్న ఆమె ఆ తర్వాత ఆలోచన మార్చుకుని యాక్టింగ్ వైపు వచ్చింది.

మొదటగా ఓ ఆల్బమ్‌లో కనిపించి సినిమా అవకాశాలు అందుకుంది.

'జోడి' చిత్రంతో నటిగా తెరంగ్రేటం చేసిన త్రిష,  ఆ తర్వాత  తమిళ చిత్రాల్లో నటించింది.

'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 'వర్షం' ఆమె కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు', 'స్టాలిన్' , పౌర్ణమి, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ చిత్రాల్లో నటించి మెప్పించింది.

కొంత కాలం తెలుగు సినిమాలకు దూరమైన త్రిష,  రీఎంట్రీలో 'పొన్నియిన్ సెల్వన్'​తో  సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. రోడ్​, లియో, రంగి  చిత్రాల్లోనూ నటించింది.

ప్రస్తుతం చిరంజీవి సరసన  'విశ్వంభర',  అజిత్ సరసన 'విదా ముయార్చి' తోపాటు పలు చిత్రాల్లో నటిస్తోంది