మనీషా ఈరబత్తిని ఒక్కటే పీస్‌!

అప్పుడు... ‘మీ అమ్మాయిని అంత దూరం పంపించేశారేంటండీ?’

ఇప్పుడు.. ‘మొన్నే మీ అమ్మాయి పాడిన పాట విన్నాం.. చాలా బాగుంది!’

అప్పుడు.. ‘ఏం అమ్మా... ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోక... ఈ పాటలూ గట్రా అవసరమా?’

ఇప్పుడు.. ‘మొన్న నీ ‘మ్యాషప్‌’ విన్నానమ్మా! చాలా బాగుంది. కొత్తగా ఏమన్నా చేశావా?’

ఇదీ మనీషా ఈరబత్తిని గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే!

అమెరికాలో మంచి జీవితం వదులుకొని ఎందుకు ఇటొచ్చావమ్మా అని అన్న నోళ్లే ‘నీ పాట మంచిగుందమ్మా అంటున్నారు

బర్కిలీ యూనివర్శిటీలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌లో కంప్యూటర్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు

మనీషా ఈరబత్తిని వరంగల్‌లో పుట్టారు. ఆరు నెలల వయసులో ఉన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోయారు

సంగీతానికీ, సినిమాకూ ఏ సంబంధమూ లేని కుటుంబం నుంచి వచ్చిన ఆమె కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్చుకున్నారు

చదువు పూర్తి చేసి జాబ్‌ ఆలోచనలో ఉండగా, బంధువుల్లో ఒకరు  ‘ఇండియాకి వెళ్లి సింగర్‌గా ట్రై చెయొచ్చు కదా’ అన్నారు

‘పాడుతా తీయగా’ కార్యక్రమమే మనీషాకు పాడటం నేర్పించింది. పాటల మీదున్న ప్రేమే నన్ను ఇండియా వచ్చేలా చేసింది.

‘రెడ్‌ ఎలర్ట్‌’తో ప్లేబ్యాక్‌ సింగర్‌గా పరిచయం అయ్యారు. తర్వాత అనూప్‌ సంగీతంలో ‘ఆలారే ఆలా’(సౌఖ్యం) పాటతో గుర్తింపు వచ్చింది

‘జెంటిల్‌మన్‌’లో ఓ పాటకు ‘హమ్మింగ్‌’ కోసం పిలిచి ‘సాటర్‌డే నైట్‌’ పాట పాడించారు మణిశర్మగారు

ఇక్కడికి వచ్చాక ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యం కోసం మెల్లగా ఇలాంటి వాటికి అడ్జస్ట్‌ అయిపోయారు మనీషా.

‘అకెపెళ్లా’ గ్రూప్‌లో చాలా మ్యాషప్స్‌ చేసిన ఆమె తెలుగులో ‘క్రేజీ ఫీలింగ్‌’ మాషప్‌ చేశారు. ఈ జనరేషన సింగర్స్‌లో మాషప్‌ను పరిచయం చేసిన సింగర్‌ మనీషానే.

యాక్టింగ్‌ చేయమని చాలా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. ‘ఫిదా’లో శైలూ పాత్ర అవకాశం వస్తే అది అంగీకరించారు.