అపర్ణ దాస్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మలయాళ కుటుంబానికి చెందిన అపర్ణ ఒమన్ లో పుట్టి పెరిగారు. తర్వాత కోయంబత్తుర్‌లో గ్రాడ్యూయేషన్ చేశారు.

చదువు పూర్తయ్యాక ఓ పెద్ద కంపెనీకి అకౌంటెంట్‌గా పని చేశారు.

టిక్‌టాక్‌ వీడియోల ద్వారా పాపులర్ అయినా  ఆమె ‘నాన్‌ ప్రకాషన్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది

'మనోహరం' ఆ తర్వాత విజయ్‌ 'బీస్ట్‌'తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వైష్ణవ్‌ తేజ్‌ సరసన 'ఆది కేశవ' చిత్రంలో  మెరిసింది

అపర్ణదాస్‌ వల్గారిటీకి, స్కిన్ షోకి దూరంగా ఉంటుంది. ఇప్పటి దాకా తను చేసినవన్నీ సంప్రాదాయ పాత్రలే.

మామూలుగా హీరోయిన్లు పెళ్లికి అంత తొందర పడరు. కానీ అపర్ణ 28 ఏళ్ళకే పెళ్లి పీటలెక్కుతోంది.

‘ముంజుమ్మల్‌ బాయ్స్‌’ ఫేం దీపక్‌ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయబోతోంది.

ఏప్రిల్‌ 24న వివాహం జరగనుంది. తాజాగా హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది.

అయితే వీరిద్దరిదీ ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం అపర్ణ దాస్ పలు చిత్రాలతో బిజీగా ఉంది