బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’.. వివరాలివే

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:44 PM

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజేతగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ పడాల, ఇప్పుడు హీరోగా సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.

Fun Movie Launch

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజేత (Bigg Boss Winner)గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ పడాల (Kalyan Padala), ఇప్పుడు హీరోగా సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ (Vindhyaa Film Productions) పతాకంపై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో, దర్శకుడు హేమంత్ కృష్ణ (Hemanth Krishna) తెరకెక్కించనున్న నూతన హారర్ కామెడీ చిత్రం ‘ఫన్’ (FUN). ఈ సినిమా నవంబర్ 6, శుక్రవారం పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నవ్వులతో పాటు ఆద్యంతం భయపెట్టే థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ కథను కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మలుస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ 12 నుంచి శరవేగంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. చిత్రీకరణను ఏకధాటిగా పూర్తి చేసి, వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కళ్యాణ్ పడాల సరసన సాహితి (Sahithi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించనున్నారు.


Kalyan-Padala.jpg

ఈ చిత్రానికి రామ్ గోపాల్ సంగీతం సమకూరుస్తుండగా, జి.ఎల్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కళ్యాణ్ పడాల క్రేజ్‌కు తగినట్లుగా సరికొత్త హంగులతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వంటి క్రేజీ అప్‌డేట్‌లను త్వరలోనే వరుసగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజులు మీడియాలో హడావుడి చేసిన కళ్యాణ్ పడాల.. మళ్లీ ఈ ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా వార్తలలో హైలెట్ అవుతున్నారు. చూద్దాం మరి.. ఈ ప్రాజెక్ట్ ఆయనని ఎంత బిజీ నటుడిని చేస్తుందో..

ఇవి కూడా చదవండి:

డిసెంబర్‌లో పెళ్లికి సిద్ధమైన మరో జంట.. ఎవరో తెలుసుగా

అప్పుడనుకున్న టైటిల్ ఇప్పుడు.. కమల్ హాసన్ నెక్స్ట్ ఫిల్మ్‌ టైటిల్ ఇదే

‘రామాయణ’పై డైరెక్టర్ శంకర్ రివ్యూ.. ఇదెవరూ ఊహించలేదు కదా

Updated Date - Nov 06 , 2026 | 08:49 PM

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..

సాయి దుర్గ తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం.. హాజరైన పలువురు సెలబ్రిటీలు

సుడిగాలి సుధీర్‌ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?

చిరంజీవి ‘మెగావర్స్‌’లో సందడి చేయనున్న స్టార్స్‌ వీరేనా?

రాధికా ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా ఫైర్