AP Elections 2024: సినిమాలు పక్కన పెట్టిన నటులు.. జోరుగా పొలిటికల్ ప్రచారాలు.

ABN , Publish Date - May 06 , 2024 | 05:16 PM

ఆంధ్ర, తెలంగాణాలలో ఎన్నికల వాతావరణం (Ap Elections 2024) వేడెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.

AP Elections 2024:  సినిమాలు పక్కన పెట్టిన నటులు.. జోరుగా పొలిటికల్ ప్రచారాలు.

ఆంధ్ర, తెలంగాణాలలో ఎన్నికల వాతావరణం (Ap Elections 2024) వేడెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. పలువురు సినీ నటులు , సినిమాలను కూడా పక్కన పెట్టి మరీ తమ సన్నిహితుల తరపున  పొలిటికల్ ప్రచారాలు  చేస్తున్నారు.  తమకు నచ్చిన పొలిటికల్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, అభ్యర్ధులను గెలిపించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. మెగాస్టార్  చిరంజీవి నేరుగా రంగంలోకి దిగకున్నా జనసేన కు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి తన మద్దతు (Star campaigners for Elections) తెలిపారు. ఇటీవలే  అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ లను గెలిపించాలని కోరుతూ వీడియోను  రిలీజ్ విడుదల చేశారు మరో  సీనియర్ హీరో వెంకటేష్  తన వియ్యంకుడు, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  రఘురాంరెడ్డి తరపున  ప్రచారం చేసెందుకు ముందుకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎంఎల్ఎ గా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోడానికి సిద్దమయ్యారు.  దీంతో పాటు చిన్నల్లుడు భరత్ కోసం వైజాగ్లో  ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

Stars.jpeg

పిఠాపురం నుంచి బరిలో దిగుతున్న  పవన్ కల్యాణ్  గెలుపు కోసం  వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్  కూడా ప్రచారంలో పాల్గొన్నారు.  పవర్ స్టార్ కోసం జబర్దస్త్ స్టార్స్ అందరు పిఠాపురంలో దిగి.. అక్కడే ఉంటూ స్వచ్చందంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైపర్ ఆది(hyper aadi) , గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ (Sudigaali sudheer), ఆటో రామ్ ప్రసాద్ లాంటి జబర్దస్త్ కమెడియన్స్ కూడా పవన్ కు  ప్రచారం చేశారు. కొందరు ఇంకా  అక్కడే ఉంటూ పవన్ గెలుపు కోసం కృషి చేస్తూనే ఉన్నారు.  యంగ్ హీరో నిఖిల్ కూడా చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్య కు ఓటు వేసి గెలిపించాలని అక్కడి ప్రజల జీవన విధానాన్ని కష్టాలను దగ్గరుండి చూస్తూ ,ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు  సోదరుడి కుమారుడు నారా రోహిత్ (Nara Rohit) సైతం తెలుగుదేశం, జనసేన, భాజాపా అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారంలోకి అడుగుపెట్టారు. మన కోసం మన నారా రోహిత్ అంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 30 ఇయర్స్ పృథ్వీరాజ్ కూటమీ  గెలుపు కోసం‌  ఎపిలో ప్రచారాలను నిర్వహిస్తున్నారు . అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కు మద్దతుగా భాజపా నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushboo) ప్రచారం చేశారు. ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ను గెలిపించాలని బీజేపీ మద్దతుదారు, సినీ నటి నమిత ప్రచారం చేశారు. ఇలా పలువురు నటులు,తమకు నచ్చిన అభ్యర్దులు మరియు  పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లుగా మారారు.

Updated Date - May 06 , 2024 | 05:19 PM