Ram Charan: 'గేమ్ చేంజర్' నుండి లీకయిన సీను, ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , Publish Date - May 06 , 2024 | 01:28 PM

'గేమ్ చేంజర్' సినిమాకి లీకులు ఎక్కువయ్యాయి. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా అవుట్ డోర్ లో అవుతూ ఉండటం వలన, ఇలా లీకులు అవుతున్నాయని అంటున్నారు. తాజా గా రామ్ చరణ్, శ్రీకాంత్ మధ్య వచ్చిన సన్నివేశాల లీకయింది, మెగా అభిమానులు ఏమంటున్నారు అంటే...

Ram Charan: 'గేమ్ చేంజర్' నుండి లీకయిన సీను, ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Ram Charan, Shankar and Dil Raju

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా 'గేమ్ చేంజర్' సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిన విషయమే. శంకర్ ఈ సినిమాకి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడనున్నారని తెలుస్తోంది. ఒక పాత్రకి కియారా అద్వానీ కథానాయిక కాగా, ఇంకో పాత్రకి అంజలి కథానాయిక. ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు వున్నారు, అందులో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, సముద్రఖని, జయరాం లాంటి వారు నటిస్తున్నారు. (Leaked scene from Game Changer doing rounds on Social Media)

తాజాగా ఈ సినిమా మళ్ళీ వార్తల్లో వుంది. ఈసారి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఈ సినిమా నుంచి లీకయిన సన్నివేశం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో పంచె కట్టులో వున్న రామ్ చరణ్, శ్రీకాంత్ ని హగ్ చేసుకుంటూ వున్న సన్నివేశం లీకయింది. మెగా అభిమానులు ఈ సన్నివేశం చూసి, ఇది థియేటర్ లో అయితే అదిరిపోతుంది అని సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. (Another scene leaked from Ram Charan and Kiara Advani starrer Game Chamger)

Game-Changer.jpg

మామూలుగా పెద్ద సినిమాలు చిత్రీకరణ జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ సెట్ పైకి తీసుకెళ్లనివ్వరు, కానీ మరి ఈ సన్నివేశం ఎలా లీకయిందో కూడా అర్థం కావటం లేదు అని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. (A scene was leaked from Ram Charan and Shankar combination film Game Changer) అయితే ఇదేమీ మొదటిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఈ చిత్రం నుండి, అలాగే వేరే చిత్రాల నుండి కూడా ఇలా చిత్రీకరణ సమయంలో సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా అవుట్ డోర్ లో చెయ్యడం వలన మొబైల్స్ పై కంట్రోల్ ఉండదని చెపుతున్నారు.

ఏమైనా ఈ సినిమాపై అంచనాలు చాలా భారీగా వున్నాయి. రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తరువాత చేస్తున్న సినిమా ఇదే కావటం, ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Updated Date - May 06 , 2024 | 01:28 PM