Krishna From Brindavanam: గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్..

ABN , Publish Date - May 08 , 2024 | 07:02 PM

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టలబ్బాయ్‌’ తర్వాత మరోసారి దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో ఆది సాయి కుమార్ చేస్తున్న ఈ సినిమాలో విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో మొదలైనట్లుగా తెలుపుతూ కొన్ని ఫొటోలను మేకర్స్ వదిలారు.

Krishna From Brindavanam: గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్..
Krishna From Brindavanam Team

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aaadi Sai Kumar) నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ (Krishna From Brindavanam). ‘చుట్టలబ్బాయ్‌’ తర్వాత మరోసారి దర్శకుడు వీరభద్రమ్ చౌదరి (Veerabhadram Chowdary)తో ఆది సాయి కుమార్ చేస్తున్న ఈ సినిమాలో విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీతం పనులు జరుగుతున్నట్లుగా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. (Krishna From Brindavanam Latest Update)

ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ నిమిత్తం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ (Anup Rubens) గోవా (Goa) వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ నటించిన ‘లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు..’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఇప్పుడు ఈ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమాకు మరోసారి అద్భుతమైన సంగీతాన్ని, పాటలను రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. (Krishna From Brindavanam Movie)


digangana.jpg

గతంలో ఆదితో కలిసి ‘క్రేజీ ఫెలో’ సినిమాలో నటించిన దిగంగన సూర్యవంశీ (Digangana Suryavanshi) ఈ చిత్రంలో మళ్ళీ ఆదితో కలిసి అలరించనుంది. ఇక ఈ సినిమాకి శ్యామ్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాము మన్నార్ డైలాగ్స్.. డ్రాగన్ ప్రకాష్, శంకర్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ తదితరులు ఇతర పాత్రలలో నటించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 08 , 2024 | 07:02 PM