Bison: ధృవ్‌ విక్రమ్‌, మారి సెల్వరాజ్‌ కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్..

ABN , Publish Date - May 07 , 2024 | 06:39 PM

చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్‌ తెరకెక్కించే కొత్త చిత్రానికి ‘బైసన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కబడ్డీ క్రీడాకారుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం ధృవ్‌ విక్రమ్‌ ముమ్మరంగా కబడ్డీ సాధన చేశాడు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌.

Bison: ధృవ్‌ విక్రమ్‌, మారి సెల్వరాజ్‌ కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్..
Dhruv Vikram in Bison

చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ (Dhruv Vikram) హీరోగా ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్‌ (Mari Selvaraj) తెరకెక్కించే కొత్త చిత్రానికి ‘బైసన్‌’ (Bison) అనే టైటిల్‌ ఖరారు చేశారు. కబడ్డీ క్రీడాకారుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం ధృవ్‌ విక్రమ్‌ ముమ్మరంగా కబడ్డీ సాధన చేశాడు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ (Pa Ranjith)కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) హీరోయిన్‌. ఇతర పాత్రల్లో లాల్‌, పశుపతి, కలైయరసన్‌, రజిషా విజయన్‌, హరి కృష్ణన్‌ అళగం పెరుమాళ్‌, అరవి మదన్‌ తదితరులు నటించనున్నారు. నివాస్‌ కె.ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. కెమెరా ఎళిల్‌ అరసన్‌. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను తాజాగా నిర్వహించి.. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.

*AP Elections - Pawan Kalyan: సినీరంగం నుంచి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు


Bison-Movie.jpg

‘పరియేరుం పెరుమాళ్‌’, ‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్‌.. ధృవ్‌ విక్రమ్‌ను దర్శకత్వం చేయడం ఇపుడు కోలీవుడ్‌లో ఆసక్తికంగా మారడమే కాకుండా, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. 2018లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన మారి సెల్వరాజ్‌ డైరెక్ట్‌ చేసిన తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2021లో ధనుష్‌ హీరోగా ‘కర్ణన్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. అనంతరం ‘వాళై’ సినిమా రూపొందించారు. ఉదయనిధి హీరోగా గత యేడాది ‘మామన్నన్‌’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలన్నీ విజయం సాధించడంతో మారి సెల్వరాజ్‌ హిట్‌ డైరెక్టర్ల జాబితాలో చేరారు. ఇప్పుడు తన 5వ చిత్రం ధృవ్‌ విక్రమ్‌తో చేస్తున్నారు. ప్రస్తుతం ధృవ్‌ విక్రమ్‌‌కు కూడా మంచి బ్రేక్ కావాలి. ఈ సినిమా ఖచ్చితంగా ధృవ్‌ విక్రమ్‌కు బ్రేక్ ఇస్తుందని కోలీవుడ్ భావిస్తోంది. (Dhruv Vikram and Mari Selvaraj Film Update)

Read Latest Cinema News

Updated Date - May 07 , 2024 | 06:39 PM