Rana Daggubati: ఆ కల ఈ సినిమాతో నెరవేరుతుంది!

ABN , Publish Date - May 05 , 2024 | 01:48 PM

టాలీవుడ్‌ నటుడు రానా దగ్టుబాటి రజనీకాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వేట్టయాన్‌’ రజనీకాంత్  స్టైల్‌లో సాగే చిత్రం కాదని అదొక భిన్నమైన చిత్రమని అన్నారు. ఆ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడారు.

Rana Daggubati:  ఆ కల ఈ సినిమాతో నెరవేరుతుంది!


టాలీవుడ్‌ నటుడు రానా దగ్టుబాటి (Rana Daggubati) రజనీకాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వేట్టయాన్‌’ (Vettaiyan) రజనీకాంత్ (Rajinikanth) స్టైల్‌లో సాగే చిత్రం కాదని అదొక భిన్నమైన చిత్రమని అన్నారు. ఆ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. ‘‘రజనీకాంత్‌ సర్‌తో కలిసి నటించాలని ఎప్పుడూ అనుకునేవాణ్ని. ఆ కల ‘వేట్టయాన్‌’తో నెరవేరింది. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ కథ చెప్పగానే ఇంప్రెస్‌ అయ్యా. జ్యుడిషియల్‌, పోలీసు వ్యవస్థ తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎంతో పరిశోధన చేసి ఈ కథ రాశారు. రజనీకాంత్‌ స్టైల్‌ సినిమా కాదిది. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన చిత్రాన్ని ఎంపిక చేసుకున్నందుకు, అందులో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌గారు, ఫహద్‌ ఫాజిల్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. అక్టోబరులో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు’’ అని తెలిపారు.

Rana.avif
అలాగే ప్రభాస్‌ 'కల్కి’, రాజమౌళి సక్సెస్‌పైనా కూడా ఆయన స్పందించారు. ‘‘దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ‘కల్కి’కి అందరూ కనెక్ట్‌ అవుతారు. హాలీవుడ్‌ ‘అవెంజర్స్‌’ రేంజ్‌లో ఉంటుంది. ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో నేను పాల్గొనడం వల్ల ఈ చిత్రంలో నటించానని అనుకున్నారు. కానీ, నేను ఇందులో యాక్ట్‌ చేయలేదు’’ అని తెలిపారు. రాజమౌళి విజయ రహస్యం గురించి చెబుతూ ‘‘నేను రాజమౌళితో కలిసి ఆరేళ్లు ట్రావెల్‌ చేశా. మార్కెట్‌ ఎలా ఉంది? రెమ్యూనరేషన్‌ ఎంత? అనే విషయాలను ఆయన పట్టించుకోరు. అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనుకుంటారు. దాని కోసం రెండేళ్లైనా, పదేళ్లైనా కష్టపడతారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - May 05 , 2024 | 03:18 PM