Vidya Balan: అది వాళ్ల దురదృష్టం అనుకుంట..

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:38 PM

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాదర్‌ ది కోర్‌’ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం మనసుకు ఎంతో నచ్చిందని ఆమె చెప్పారు

Vidya Balan: అది వాళ్ల దురదృష్టం అనుకుంట..

మమ్ముట్టి (Mamootty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాదల్‌.. ది కోర్‌’ (Kaathal – The Core) చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ 9Vidya balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం మనసుకు ఎంతో నచ్చిందని ఆమె చెప్పారు. ‘‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా మలయాళ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నా. మోహన్‌లాల్‌ సినిమాలంటే నాకెంతో ఇష్టం. ఆయన చిత్రాల్లో కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ఈ మధ్యనే మమ్ముట్టి యాక్ట్‌ చేసిన ‘కాదల్‌ ది కోర్‌’ చూశా.  అద్భుతంగా నటించారు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. సినిమా చూసిన కొంతసేపటి దాకా   ఆ పాత్ర నన్ను వెంటాడుతూనే ఉంది. సినిమా చూసిన తర్వాత దుల్కర్ సల్మాన్‌కు మెసేజ్  పంపించా. ఆ సినిమా నాకెంతో నచ్చిందని చెప్పా. ఆ విషయాన్ని మమ్ముటీకి తెలియపరచమని చెప్పా. బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్‌ హీరోలు ఉన్నా.. ఆ తరహా చిత్రాల్లో యాక్ట్‌ చేయడానికి ఒక్కరు కూడా ఆసక్తి చూపించరు. అది వాళ్ల దురదృష్టం అనుకుంటా’’ అని కామెంట్‌ చేశారు.

‘డర్టీ పిక్చర్‌’పై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘స్మోకింగ్‌ ఎలా చేయాలో నాకు తెలుసు. కానీ ఎప్పుడూ దాని జోలికి వెళ్లలేదు. ‘డర్టీ పిక్చర్‌’ తర్వాత స్మోకింగ్‌ అలవాటుగా మారింది. కొన్ని రోజులపాటు దానిని కొనసాగించా. కానీ ఆరోగ్య సమస్యలు వస్తామని అర్థమై దానికి దూరమయ్యా’’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె దో ఔర్‌ దో ప్యార్‌, భూల్‌ భూలయ్య 3’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

Updated Date - Apr 26 , 2024 | 05:38 PM