Malavika Mohanan: నెటిజన్లకు  చెంప చెళ్లుమనేలా ఇచ్చేసింది!

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:37 PM

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో 'తంగలాన్'(Thangalan), తెలుగులో 'రాజా సాబ్‌'(Raja Saab), హిందీలో 'యుద్ర' చిత్రాలున్నాయి.

Malavika Mohanan: నెటిజన్లకు  చెంప చెళ్లుమనేలా ఇచ్చేసింది!
Malavika Mohanan

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో 'తంగలాన్'(Thangalan), తెలుగులో 'రాజా సాబ్‌'(Raja Saab), హిందీలో 'యుద్ర' చిత్రాలున్నాయి. అయితే ఈ మూడు చిత్రాలు షూటింగ్‌కు విరామం రావడంతో ఆమె కాస్త చిల్‌ అవుతున్నారు.

ఇటీవల ఫారిన్  ట్రిప్‌ వేసిన ఆమె ప్రస్తుతం ఇంట్లో ఉంటూ అభిమానులతో నెట్టింట ముచ్చట్లు పెడుతున్నారు. ‘ఆస్క్‌ మాళవిక’ అంటూ ట్విటర్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించారు. ఆమె నటిస్తున్న చిత్రాలు, ఇష్టాయిష్టాల గురించి పలువురు నెటిజన్లు అడగగా, ఓ నెటిజన్ మాత్రం అసహనానికి గురయ్యే ప్రశ్న అడిగాడు. ఇంతకీ అతను అడిగిన ప్రశ్న ఏంటంటే.. ‘‘గ్లామర్‌ షో చేయడం కాకుండా పాత్రకు తగ్గట్లు యాక్ట్‌ చేయడం ఎప్పుడు మొదలుపెడతారు’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు అసహనానికి లోనైన మాళవిక ‘నేను చేయను. నీకు ఏమైనా ఇబ్బందా?’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘ఫీల్‌ అవ్వకండి మేడమ్‌’, ‘మీరు అలాంటి వారికి ఎందుకు ఆన్సర్‌ ఇస్తారు’ అంటూ మరికొందరు అభిమానులు ఆమెను కూల్‌ చేశారు. తనకు లవ్‌ డ్రామా, రొమాంటిక్‌ కామెడీ, థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పారు. కథానాయికల్లో అనుష్కాశెట్టి, సమంత అంటే చాలా ఇష్టమని, ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ హృతిక్‌ రోషన్  అని తెలిపింది. ఈ చిట్‌చాట్‌లో మరికొందరు అడిగిన ప్రశ్నలివి.. (Counter to Netizens)

Malavika-mohanan.jpg


‘తంగలాన్‌’లో మీ క్యారెక్టర్‌కు మీరే డబ్బింగ్‌ చెప్పారా? విడుదల ఎప్పుడు?
మాళవిక: అవును. నేనే డబ్బింగ్‌ చెప్పా. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా. ఇక ఈ సినిమా విడుదల గురించి నాకూ తెలియదు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు.

హైదరాబాద్‌లో మీకు నచ్చిన వంటకం?

మాళవిక: అన్నీ ఇష్టమే. హైదరాబాద్‌ ఫుడ్‌ స్పైసీగా ఉంటుంది.

ఎక్కువగా గ్లామరస్‌ ఫొటోషూట్స్‌ చేస్తుంటారు ఎందుకు!
మాళవిక: గ్లామర్‌ షూట్స్‌ అంటే నాకిష్టం

పెళ్లెప్పుడు?
నా పెళ్లి కోసం నువ్వెందుకు తొందరపడుతున్నావ్‌.

 Read More: Tollywood, Cinema News, Bollywood

Malavika-mohanan-2.jpg

Mehreen: ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకున్నా.. ఇది చాలా అవసరం!


Updated Date - Apr 30 , 2024 | 01:37 PM